అమెజాన్‌పై పోరాటం చేస్తాం

అమెజాన్‌పై పోరాటం చేస్తాం

చెన్నై: ది ప్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ పై వివాదాలు రాజు కుంటున్నాయి. సమంత తమిళ యువతిగా వ్యతిరేక పాత్రలో నటించినందుకు తమిళులు మండి పడున్నారు. ఈ సిరీస్ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేశాయి. అయినా సిరీస్ గత 4 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారమవుతోంది. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా దీనిపై మండి పడ్డారు. ‘తమిళ జాతికి వ్యతిరేకంగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ రూపొందింది. దాన్ని ప్రసారం చేయరాదని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ సిరీస్ను తమిళ ద్రోహులు రూపొందించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలి. లేదంటే తాము అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమ’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos