బోనెక్కనున్న ఫఢ్నవీస్‌

బోనెక్కనున్న ఫఢ్నవీస్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. 2014 ఎన్నికల ప్రమాణ పత్రం వ్యాజ్యంలో ఆయన విచారణ అనివార్యమైంది. ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆరంభానికి గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని చేసిన వినతిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.2014 ఎన్నికలపుడు ఫఢ్నవీస్ సమర్పించిన ప్రమాణ పత్రంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రెండు కేసుల వివరాలను పేర్కొననందున ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఒకరు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని నాగ్పూర్ న్యాయస్థానం తిరస్కరించింది.బాంబే ఉన్నత న్యాయస్థానమూ దాన్ని సమర్థించింది. దరమిలా ఆ న్యాయవాది రెండు న్యాయస్థానాల తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఫడ్నవీస్ పై కేసు దాఖలు చేసిన విచారణ చేపట్టాలని నిరుడు ఆక్టోబర్లో నాగ్పూర్ కోర్టును ఆదేశించింది. ప్రజా సమస్యల కోసం నిరసన తెలిపినప్పుడు రాజకీయ ప్రేరేపణతో తనపై ఆ కేసులు దాఖల య్యాయని ఫడ్నవీస్ సుప్రీంకోర్టులో సమీక్ష వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జరిమానాతో సరిపోయే తప్పి దానికి క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని విన్నవించారు. కానీ, తమ తీర్పును సమీక్షించబోమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos