ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు

న్యూఢిల్లీ: జేఎన్యూ ఆవరణలో ఈ నెల 5న జరిగిన హింసాకాండ సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు ఆచార్యులు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సోమవారం ఫేస్బుక్, వాట్సాప్లకు తాఖీ దుల్ని జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము జేఎన్యూ అధికా రులను కోరినా స్పందనా రాలేదని పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. కేసుకు సంబంధించిన రెండు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్కు లేఖ రాశామన్నారు. యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్ , ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్ వాట్సాప్ గ్రూపుల డేటాను భద్ర పరచాలని సెక్యూర్ చేయాలని డిలీట్ అయిన పక్షంలో ఆ డేటాను తిరిగి పొందాలని వాట్సాప్, గూగుల్, యాపిల్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జేఎన్యూ ప్రొఫెసర్లు అమిత్ పరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్లు ఈ నెల 10న ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు కోర్టును కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos