ఫేస్ బుక్ ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

ఫేస్ బుక్ ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

వాషింగ్టన్ : కరోనా వ్యాధి బారి నుంచి కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు ఫేస్ బుక్ లోని 45 వేల మంది పూర్తి కాల ఉద్యోగులకు ఆరు నెలల వేతనాన్ని బోనస్ గా అందిస్తున్నామని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇళ్ల నుంచి పని చేసే వారికి అదనంగా మరో 1000 డాలర్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ 1000 డాలర్లతో ఇంటి నుంచి పని చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న ఫేస్ బుక్ కార్యాలయాల్లో లాక్ డౌన్ ప్రకటించినా, వారు విధులకు రాకపోయినా పూర్తి వేతనం ఇస్తామని వివరించారు. సియాటెల్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా కార్యాలయాలు చాలా వరకూ మూతబడ్డాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos