కాలం చెల్లిన మందులతో ఆరోగ్యమస్తు…!

కాలం చెల్లిన మందులతో ఆరోగ్యమస్తు…!

హొసూరు : ఇక్కడికి సమీపంలోని కామన్‌దొడ్డి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులను పంపిణీ చేయడం ద్వారా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 30 గ్రామాలకు పైగా ప్రజలకు ఈ ఆరోగ్య కేంద్రమే దిక్కు. కొద్ది రోజులుగా సరైన మందులు, మాత్రలు పంపిణీ చేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చే రోగులను మాత్రలతోనే సరిపెడుతున్నారని, అవి కూడా కాల పరిమితి దాటినవని రోగులు తెలిపారు. ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది, మందులు కాల పరిమితి దాటినా చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos