కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఢిల్లీ: కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను ‘విపత్తు’గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థికంగా ఆదుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి ఇద్దరు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos