‘పెరియార్‌’పై దాడి

‘పెరియార్‌’పై దాడి

చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ -రామస్వామి నాయకర్ విగ్రహాన్ని చెంగల్పేట్ జిల్లా కలియ పట్టాయి గ్రామంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. విగ్రహం కుడిచేయి, ముఖం దెబ్బ తిన్నాయి. దీంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలియగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారం భించారు. 1971లో సేలంలో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలకు పాదరక్షల దండ వేశారని రజినీకాంత్ గత వారం కోయంబత్తూరులో జరిగిన తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.. రజినీకాంత్ క్షమాపణ చెప్పాలని డిఎంకే కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నలుపురంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. క్షమాపణకు రజినీ నిరాకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos