‘ఎవరెస్టు’ను అధిరోహించిన 10 ఏళ్ల చిన్నారి

‘ఎవరెస్టు’ను అధిరోహించిన 10 ఏళ్ల చిన్నారి

ముంబై : నగరానికి చెందిన రిథమ్ మమానియా(10) బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్లోని సౌత్ బేస్ క్యాంప్కు చేరుకుంది. 11 రోజు ల పాటు సాగిన యాత్ర బేస్క్యాంప్కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్ బేస్క్యాంప్కి చేరుకున్న తర్వాత ఆమెతో పాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం. “తొలిసారిగా కాలినడకన దూద్ సాగర్ ట్రెక్కిం గ్ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతే కా దు ఈ ట్రెక్కింగ్ బాధ్యయుతమైన ట్రెక్కర్గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది” అంటూ రిథమ్ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos