డెంకణీకోటలో భయపెడుతున్న ఏనుగు

హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని  గెండిగానిపల్లి గ్రామంలోకి   ఏనుగు ప్రవేశించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఓ ఏనుగు మిట్ట మధ్యాహ్నం  గెండిగానపల్లి గ్రామంలోకి   ప్రవేశించింది గ్రామవీధుల్లో ఏనుగు ప్రత్యక్షం అవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. తరువాత గ్రామస్తులు అందరూ కలిసి ఏనుగు ను అటవీ ప్రాంతానికి తరిమివేశారు గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా సంచరిస్తూ గ్రామస్తులను బెదిరిస్తు న్నదని, పొలం పనులకు కూడా వెళ్ళలేక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు విచ్చలవిడిగా తిరుగుతున్న ఏనుగుల మందును దట్టమైన అటవీ  ప్రాంతానికి తరలించడానికి చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించకపోతే ఆందోళన నిర్వహించేందుకు కూడా వెనుకాడ బోమని వారు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos