విద్యుదాఘాతానికి ఏనుగు మృతి

హొసూరు : ఇక్కడికి సమీపంలోని తళి అటవీ ప్రాంత గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. తన పంట వన్యప్రాణుల పాలు కాకుండా నివారించడానికి ఓ రైతు కంచె వేసి కరెంటు పెట్టాడు. ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన ఓ ఏనుగు కంచె వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. అధికారులు విచారణ చేపట్టారు.

తాజా సమాచారం