ఏమిటీ ‘ఫ్యూచ‌ర్ గేమింగ్‌’

ఏమిటీ ‘ఫ్యూచ‌ర్ గేమింగ్‌’

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు చెందిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ వద్ద బాండ్లు కొన్న సంస్థలు సమాచారం కూడా రిలీజైంది. అయితే కోయంబత్తూరుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ సుమారు 1368 కోట్లు విరాళం ఇచ్చింది. వివిధ రాజకీయ పార్టీలకు ఆ బాండ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12, 2019 నుంచి జనవరి 24, 2024 వరకు ఆ బాండ్లను ఖరీదు చేశారు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థను 1991లో స్థాపించారు. గతంలో ఆ సంస్థను మార్టిన్ లాటరీ ఏజెన్సీ పేరుతో పిలిచేవారు. దీని ఓనర్ శాంటియాగో మార్టిన్. ఈయన్నే లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆ సంస్థ వెబ్సైట్ కోసం .. 13 ఏళ్ల వయసులోనే మార్టిన్ లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా లాటరీ కొనుగోలుదారులు, అమ్మకందారులకు చెందిన డేటా నెట్వర్క్ను మేనేజ్ చేశాడు. తమ కంపెనీకి చెందిన డ్రాలను టీవీల్లో లైవ్ ఇచ్చిన తొలి లాటరీ కంపెనీగా ఫ్యూచర్ గేమింగ్ రికార్డు స్థాపించింది. ఆసియా పసిఫిక్ లాటరీ అసోసియేషన్లో ఫ్యూచర్ గేమింగ్కు సభ్యత్వం ఉన్నది. 2001 నుంచి వరల్డ్ లాటరీ అసోసియేషన్లో ఫ్యూచర్ గేమింగ్ కు సభ్యత్వం ఉంది. 2009లో ఫ్యూచర్ సంస్థకు డబ్ల్యూఎల్ఏ నుంచి లెవల్ వన్ అక్రిడేషన్ లభించింది. ఫ్యూచర్ వెబ్సైట్ ప్రకారం .. లిబేరియాకు మార్టిన్ ప్రస్తుతం కౌన్సుల్ జనరల్గా ఉన్నారు. అక్కడ ఆయన లాటరీ సంస్థను స్థాపించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్కు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ గ్రూపులో లాటరీ డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, ఏజెంట్లు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos