రాహుల్‌ కు ఎన్నికల సంఘం తాఖీదు

రాహుల్‌ కు ఎన్నికల సంఘం తాఖీదు

న్యూఢిల్లీ: ‘గిరిజనులను కాల్చిపారేసేలా మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది’అని మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చేసిన ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గురు వారం తాఖీదులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది. గత ఏప్రిల్ 23న షాదోల్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ఆ ఆరోపణ చేసారు. ‘గిరిజనులు, ఆది వాసీల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై కొందరు భాజపా కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos