సినీ ప్రముఖులైనా వదిలేది లేదు

సినీ ప్రముఖులైనా వదిలేది లేదు

హైదరాబాద్: మాదక ద్రవ్యాల వాడకం ప్రతి ఇంటికీ సమస్యగా పరిణమిస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘డ్రగ్స్ వాడే వారిని నియంత్రించలేనంత వరకూ డ్రగ్స్ ను అంతం చేయలేం. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోము. ఇకపై సినీ ప్రముఖులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం, సీఎం సీరియస్ గా ఉన్నార’ని చెప్పారు. డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న మరో 13 మందిని గుర్తించారు. నిరంజన్ కుమార్ జైన్ అనే కాంట్రాక్టర్ దాదాపు 30 సార్లు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు తేల్చారు. నిందితులను శాశ్వత్ జైన్, యగ్యానంద్, సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్, బాడి సుబ్బారావులుగా గుర్తించారు. అందులో చాలా మంది ఆర్థికంగా బాగా స్థిర పడిన వారేనని పోలీసులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos