భారీగా కూలిన జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేర్లు

భారీగా కూలిన జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేర్లు

ముంబై: జెట్ ఎయిర్ వేస్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ మొదలైన తర్వాత 29 శాతం వరకూ కుంగాయి. ఒక దశలో జీవనకాలంలో అతి తక్కువైన రూ.28.60కు దిగజారింది. ఈ సంస్థ నీ భవిష్యత్తు గురించి ఎన్సీఎల్టీలో బుధవారం విచారణ జరగనున్నందున తో మదుపర్లు ఈ కంపెనీ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. ఎస్బీఐ నేతృత్వంలోని రుణ దాతల సమితి మంగళవారం ముంబయి ఎన్సీఎల్టీలో వ్యాజ్యాన్ని చేసింది. గత వారం కంపెనీ షేర్లు 74 శాతం కుంగాయి. దీంతో జూన్ 28 నుంచి కంపెనీ షేర్లను ట్రేడ్-టూ-ట్రేడ్ విభాగంలోకి చేర్చారు. ఆడిట్ డిక్లరేషన్పై వచ్చి న వదంతుల విషయంలో కంపెనీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో స్టాక్ ఎక్స్ ఛేంజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos