గోధుమ దిగుబడి తగ్గుదల

గోధుమ దిగుబడి తగ్గుదల

న్యూ ఢిల్లీ : గోధుమల ఉత్పత్తి ఈ ఏడాది తగ్గిపోనుంది. నిరుటితో పోలిస్తే 3 శాతం మేర తగ్గిపోతుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. 10.6 కోట్ల టన్నులకు పడిపో తుందని పేర్కొంది. 2014–15 తర్వాత గోధుమ దిగుబడి తగ్గిపోవడం ఇదే తొలిసారి. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమేనని దీనికి కారణమని చెప్పింది. నిరుడు 10.9 కోట్ల టన్నుల గోధుమల దిగుబడి రాగా ఈ ఏడాది 11.1 కోట్ల టన్నులు వస్తుందని ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వేసవి త్వరగా వచ్చినందున గోధుమల ఉత్పత్తి 10.5 కోట్ల టన్నులకు పడి పోతుందని ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు. గోధుమల దిగుబడి తగ్గినా మొత్తం ఆహార ధాన్యాల దిగు బడులు మాత్రం పెరుగుతాయని పేర్కొంది. మొత్తం 31.4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వస్తాయంది. వరి, జొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos