భవిష్యత్‌ పోరు దేశవాళీ ఆయుధాలతోనే

భవిష్యత్‌ పోరు దేశవాళీ ఆయుధాలతోనే

న్యూ ఢిల్లీ : ‘భవిష్యత్తులో జరగబోయే యుద్ధం కచ్చితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతోనే జరుగుతుంది. ఆ పోరులో భారత్ తప్పకుండా గెలిచి తీరుతుంద’ని పదాతి దళపతి రావత్ ఆశించారు. మంగళ వారం ఇక్కడి జరిగిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ సంచాలకుల 41వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధ, సైబర్, అంతరిక్ష, లేజర్, ఎలక్ట్రానిక్, రోబోటిక్ సాంకేతికతలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. సాయుధ దళాల అవసరాల్ని స్వదేశీ పరిజ్ఞానంతో తీర్చేందుకు డీఆర్డీవో చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలను బలంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ‘అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశాలు ఎప్పటికీ ముందుంటాయి. అలాంటి దేశాలే మానవ సమాజానికి ఎంతో మేలు చేయగలిగాయి. ఈ విషయంలో భారత్ కాస్త వెనకబడే ఉంది. డబ్బు, సాంకేతికతే భౌగోళిక రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ రెండింట్లో సాంకేతికత మరింత కీలకమ’ని దోవల్ అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos