కేటీఆర్ కాలికి గాయం : మూడు వారాల విశ్రాంతి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కేబినెట్‌లో కీలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం కింద పడిపోయారట. నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉరుకులు పరుగుల మీద ఉండే కేటీఆర్ శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో ఆయన కింద పడిపోయారట. ఈ సందర్భంగా ఆయన కాలు చీలమండకు దెబ్బ తగిలింది. దీంతో ఇంటికి చేరిన కేటీఆర్… కాలి చీలమండకు పెద్ద బూటు లాంటి బ్యాండేజీతో కనిపించారు.
ఓ కార్యక్రమంలో కింద పడిపోయానని, దీంతో చీలమండ దెబ్బతిన్నదని కేటీఆర్ స్వయంగా శనివారం సాయంత్రం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. చీలమండకు బ్యాండేజీ వేసుకుని కాలు జాపుకుని కూర్చున్న ఫొటోను కూడా ఆయన దానికి జత చేశారు. ఈ సందర్భంగా వైద్యులు 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారని చెప్పిన కేటీఆర్…ఈ 3 వారాల పాటు కాలక్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు ఉంటే తెలపాలంటూ కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos