నేడు భాగ్యనగరి పుట్టినరోజు..

నేడు భాగ్యనగరి పుట్టినరోజు..

ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ నగరానికి ఉన్న పేరు,ప్రఖ్యాతులు,విశిష్టతలు చాలా వేరు.లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగులైనా,15 వేలు జీతం వచ్చే ఉద్యోగులైన హైదరాబాద్ నగరంలో నిశ్చితంగా బతికేయొచ్చు.భాగ్యనగరి,ముత్యాల నగరం,హైటెక్ సిటీ ఇలా ఎన్నో పేర్లు,మరెన్నో బిరుదులు కలిగి ఉన్న హైదరాబాద్ నగరానికి ఎప్పుడు,ఎలా పునాది పడిందో తెలుసా ?ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.భాగ్యనగర నిర్మాణం మొదలైన సంవత్సరంగా 1591 మంది అని చెబుతారు. కానీ.. పుట్టిన రోజు (శంకుస్థాపన తేదీ) ఎప్పుడు అంటే మాత్రం తెలీదనే సమాధానం శస్తుంది. మహ్మద్ కులీ ఆలోచనలతో.. ఇరానీ ఆర్కిటెక్టు మీర్ మోమిన్ సృజన నుంచి పురుడుపోసుకున్న ఈ మహానగరం ప్రారంభాన.. సదరు రాజు ఏం కోరుకున్నారో తెలుసా? ‘‘హె అల్లా.. చేపలతో చెరువు ఎలా అయితే కళకళలాడుతుందో.. నా నగరాన్ని ప్రజలతో నింపేయ్’’ అని కోరుకున్నారట. ముహుర్తబలమే కావొచ్చు.. రాజు వారి కోరిక తీరింది. ఇంతకీ నగర పుట్టిన రోజు ఎప్పుడన్న విషయాన్ని పలు పరిశోధనలు చేసి చివరకు ఈ రోజే (అక్టోబరు 8) అని తేల్చారు. 1591 అక్టోబరు 7న మహానగరానికి జన్మదినమని హైదరాబాద్ ట్రైల్స్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ నిర్వాహఖుడు గోపాల క్రిష్ణ చెబుతున్న దాని ప్రకారం ఒక ఫర్మానాలో పొందుపరిచిన ఆధారాల ఆధారంగా ఈ విషయాన్ని తాము చెబుతున్నామంటున్నారు. చంద్రుడు సింహరాసిలోకి ప్రవేశించి.. బృహస్పతి స్వస్థానంలోకి వెళ్లడంతో పాటు అన్ని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్న శుభముహూర్తాన భాగ్యనగరికి పునాది పడినట్లుగా తేల్చారు.ఫర్మానాలోని గ్రహస్థితి ఆధారంగా ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు ఏడును హైదరాబాద్ పుట్టిన రోజుగా డిసైడ్ చేశారు. ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos