దేవెగౌడకు కోవిడ్ పాజిటివ్

దేవెగౌడకు కోవిడ్ పాజిటివ్

బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) సుప్రీం హెచ్డీ దేవెగౌడ కరోన బారిన పడ్డారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పేర్కొంది. ఎనభై ఎనిమిదేళ్ల దేవెగౌడ భారతదేశ 12వ ప్రధానిగా 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకూ సేవలందించారు. 1994 నుంచి 1996 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహి స్తున్నారు. జేడీ(ఎస్) జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos