మన దేశానికి నియంతృత్వమే మేలు

మన దేశానికి నియంతృత్వమే మేలు

హైదరాబాదు: మన దేశానికి నియంతృత్వమే మేలని వ్యాఖ్యానించిన నటుడు విజయ్ దేవరకొండ వివాదాల సుడిలో చిక్కుకున్నారు. నెటిజన్లు ఆయనపై విరుచుకు పడ్డారు. బదులివ్వజాలక దేవర కొండ బిక్క మొహం వేయటం విశేషం. ఫిలిం కంపానియన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ రాద్ధాంతానికి వేదిక. అందులోని ముఖ్యాంశాలు..దేశానికి నియంతృత్వమే సరైంది. ఓటు వేసే హక్కును కొందరికే పరిమితం చేయాలి. ఒక విమానం ఎక్కినప్పుడు పైలట్ ని అందులో ఉన్న 300 మంది ప్రయాణికులు వోట్ వేసి ఎన్నుకోరు కదా, అలానే రాజకీయ నాయకుడిని.. కూడా పూర్తి అవగాహనా ఉన్న ఒకడి చేతిలో రాజ్యాధికారాన్ని పెట్టాలి. అందరికి వోట్ హక్కు కల్పించకూడదు. ఓట్లను అమ్ముకునే వారికి ఆ హక్కును తీసి వేఆయలి. డబ్బున్నవారికి కూడా ఆ హక్కు ఇవ్వరాదు. మధ్యతరగతి వారికి మాత్రమే వోట్ హక్కు కల్పించాలి. పేదలు ఓట్లు అమ్ముకుంటారు. ఎవరికీ వోట్ వేస్తున్నామో, ఎందుకు వేస్తున్నామో కూడా తెలియకుండా ఓటు వేస్తున్నారు. ప్రజలకు పరిపాలన తెలియదు. అన్నీ మూసుకొని కూర్చోవాలి. నాయకుడు అంతా చూసుకుంటాడు. 5 -10 సంవత్సరాల్లో అంతా బాగా మారిపోతుంది. ఇందుకు నియంతృత్వమే సరైన పద్దతి. నాయకుడు మంచివాడై ఉండాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos