సర్కారు బడుల వైపు బాలల పరుగు

సర్కారు బడుల వైపు బాలల పరుగు

న్యూ ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడంపై ఆప్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మౌలిక వసతుల్ని మెరుగు పరిచి ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీర్చిదిద్దారు. ఈ ప్రయత్నాలు ఫలించి ప్రభుత్వ పాఠశాలు అద్భుతంగా తయారయ్యాయి. గత కొన్ని సంవత్సరాలలో ప్రైవేట్ స్కూళ్లలో చదువు కుంటున్న రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. . ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ సంస్థతో ఢిల్లీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యంత నాణ్యమైన విద్యను పొందేందుకు ఈ ఒప్పందం దోహదం చేసిందని చెప్పింది. అందువల్లే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. సీబీఎస్ఈ తరహాలో సొంతంగా ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ఏర్పాటు చేసింది. దీని వల్ల ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందుతున్నారని ప్రశంసించింది.

తాజా సమాచారం