జనారణ్యంలోకి జింక

జనారణ్యంలోకి జింక

హొసూరు : ఇక్కడికి సమీపంలోని సూలగిరి  ప్రాంతం నుండి దారి తప్పి ఓ జింక పట్టణంలోకి వచ్చింది. జింకను చూసిన కుక్కలు దాన్ని వెంబడించడంతో స్థానికులు కాపాడి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి  సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో చిరుత పులులు, ఏనుగులు, జింకలు వన్యప్రాణులు ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండగా రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు లేకపోవడంతో అటవీ ప్రాంతంలో  సంచరిస్తున్న వన్య మృగాలు గ్రామాల వైపు రావడం మొదలైంది. శనివారం ఉదయం ఓ జింక అటవీ ప్రాంతం నుండి దారి తప్పి సూలగిరి  పట్టణంలోకి ప్రవేశించింది. జింకను చూసిన వీధి శునకాలు దానిని వెంబడించడంతో అది పరుగు తీసింది. స్థానికులు కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు జింకకు వైద్య సేవలు చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అధికారులు అటవీ ప్రాంతానికి వెళ్లి జింక పిల్ల కళ్లకు కట్టిన తాడు విప్పడంతో గెంతులేస్తూ అడవిలోకి పరుగు తీసింది.

తాజా సమాచారం