వికేంద్రీకరణతోనే అభివృద్ధి

వికేంద్రీకరణతోనే అభివృద్ధి

అమరావతి: అభివృద్ధిలో ఒక ప్రాంత ఆధిపత్యం ఉండరాదని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామ కృష్ణన్ గతంలో పేర్కొన్న వీడియోలను వైకాపా శనివారం ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి మూడు పంటలు పండడం ఓ వరం. అలాంటి గుంటూరు-విజయ వాడ మధ్య ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే ఆరోగ్య భద్రతకు ముప్పు. 21వ శతాబ్దంలో అభివృద్ధి.. వికేంద్రీకరణ, నగరాలు, సాంకేతిక అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఒక భారీ నగరాన్ని నిర్మించదలచటం. అక్కడే అభివృద్ధిని కేంద్రీకరించా లను కోవడం సమస్యకు పరిష్కారం కాద’ని విశదీక రించారు. మేధావులూ మూడు రాజధానులకే మొగ్గు చూపుతు న్నారని చాటి చెప్పదలచటం వైకాపా ఆంతర్యంగా అర్థమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos