బెంగాలీ డైరెక్టర్ బుద్ధదేవ్ దాస్గుప్తా కన్నుమూత

బెంగాలీ డైరెక్టర్ బుద్ధదేవ్ దాస్గుప్తా కన్నుమూత

కోల్కతా : జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ డైరెక్టర్ బుద్ధదేవ్ దాస్గుప్తా (77) వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాతలు సత్యజిత్ రే, ఘటక్ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడాయన. బుద్ధదేవ్ దాస్గుప్తా, గౌతమ్ ఘోస్, అపర్ణాసేన్తో కలిసి 1980-1990లో పోటీ సినిమా ఉద్యమాన్ని నడిపారు. దూరత్వా (1978), గ్రిహజుద్ధ (1982), ఆంధిగాలి (1984) వంటి సినిమాలు బెంగాల్లో నక్సలైట్ ఉద్యమం ఎలా మొదలైంది? సామాజిక చైతన్యం ఎలా పెంపొందిందనే విషయాలను తెలియజేస్తాయి. బాగ్ బహదూర్ (1989), చారచరార్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002), కల్పురుష్ (2008)తో సహా ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. అలాగే దూరత్వా (1978), తహదర్ కథ (1993) బెంగాలీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తరా (2000), స్వాప్నర్ దిన్ (2005) వంటి చిత్రాలకు ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు.ఆయన సుప్రసిద్ధ కవి కూడా. సూట్కేస్, హిమ్జోగ్, గోవిర్ అరలే, కాఫిన్ కింబా, ఛాటా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కబితా, భోంబోలర్ ఆశ్చర్య కహిని ఓ కబిటా వంటి కవితలు ప్రసిద్ధి చెందాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos