రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం

రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం

న్యూ ఢిల్లీ: గత రెండేళ్లుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఎత్తి వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే శాఖ వారి నుంచి అదనంగా రూ. 1500 కోట్లు వసూలు చేసింది. కరోనా సాకుతో కారణంగా అన్ని రకాల రాయితీలను రైల్వేశాఖ ఎత్తేసింది. 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ వాళ్లకు టిక్కెట్టు ధరలో 40 శాతం రాయితీ ఉంది. 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా వివిధ రైళ్లలో 7.31 కోట్ల మంది వృద్దులు ప్రయాణించారు. వారి ద్వారా రైల్వేకు రూ.3464 కోట్ల ఆదాయం సమకూరింది. రాయితీ అమలు చేసి ఉంటే రైల్వే శాఖ ఖజానాలో చేరిన రూ.3464 కోట్ల రూపాయల్లో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేది. ఈ డబ్బు వారి కనీస అవసరాలు, మందులు మాకులకు పనికి వచ్చేవి. కరోనా కష్ట సమయంలోనూ వృద్ధులపై దయ చూపేందుకు రైల్వేశాఖ ససేమిరా అంది. ప్రతీ ప్రయాణంలోనూ వారి వద్ద నుంచి ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ తన బొక్కసం నింపుకుంది. వృద్ధులు, సైనికులు, రోగులు, మాజీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు ఇలా మొత్తం 53 రకాల రాయితీలను అందిస్తోంది, వీటి విలువ ఏటా సగటున రూ.2000 కోట్లు. ఆ మేరకు సామాజిక భద్రత లభిస్తోంది. లాభాలే ముఖ్యం సామాజిక భద్రత మా బాధ్యత కాదన్నట్టుగా ఇటీవల రైల్వే వ్యవహరిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos