కాఫీతో కోవిడ్ టెస్ట్

కాఫీతో కోవిడ్ టెస్ట్

కాఫీ తాగేవారు కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించిన వారిలో రుచి, వాసన లక్షణాలు కోల్పోవడంతోపాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయనే విషయం తెలిసిందే! కొంత మంది వీటిని పసిగట్టలేకపోవడం కూడా చూస్తున్నాం!
కాఫీ పరిమళాన్ని, రుచిని ఆస్వాదిస్తూ తాగడం మనలోచాలా మందికి అలవాటే. కరోనాను పసిగట్టంలో కూడా ఇదే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎప్పటిలా కాఫీ నుంచి వచ్చే కమ్మని పరిమళం మీ ముక్కును తాకడంలో ఏదైనా ఇబ్బంది కలిగినా.. లేక రుచిని తెలుసుకోలేకపోయినా వెంటనే అనుమానించవల్సిందే. కోవిడ్‌ను పసిగట్టడానికి పరిశోధకులు కాఫీనే ఎక్కువగా వాడుతున్నారట కూడా. వాసన చూడలేకపోయినవారిని పరీక్షిస్తే, వారిలో కోవిడ్ బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos