లిక్కర్ నిషేధించినందుకు వ్యక్తి ఆత్మహత్య..

లిక్కర్ నిషేధించినందుకు వ్యక్తి ఆత్మహత్య..

రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించడంతో కేరళకు చెందిన వ్యక్తి తీవ్రంగా విత్ డ్రాల్ లక్షణాలకు గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన త్రిస్సూర్ జిల్లాలో చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లా కున్నకుళం ప్రాంతానికి చెందిన సనోజ్ కులంగర (38) రోజు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ నుండి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడురోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు.. దాంతో వారం మద్యం అమ్మకాలపై కేరళ మొత్తం నిషేధం విధించింది క్రమంలో ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన కులంగర తీవ్రంగా విత్ డ్రాల్ లక్షణాలతో బాధపడ్డాడని.. తరుణంలో బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.కాగా రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో విత్ డ్రాల్ లక్షణాలతో నలుగురిని ఆసుపత్రులలో చేర్పించినట్లు కేరళ పర్యాటక మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఇంతకు ముందు చెప్పారు.కేరళలో సుమారు 1.6 మిలియన్ల మందికి మద్యపానం అలవాటు ఉందని మానసిక వైద్యులు చెప్పారు.. వ్యక్తులకు తీవ్రమైన విత్ డ్రాల్ లక్షణాలను చూపించవచ్చని.. ప్రస్తుతం రాష్ట్రం కోవిడ్ -19 తో పోరాడుతున్న వేళ వారిని ఆసుపత్రులలో చేర్పించడం ప్రమాదకరమని వారు హెచ్చరించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos