బీజేపీ అవినీతి కథ @ వన్‌ క్లిక్‌

బీజేపీ అవినీతి కథ @ వన్‌ క్లిక్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన వెబ్సైట్. www.corruptmodi.com వెబ్సైట్ ఆంగ్ల అక్షర క్రమంలో ప్రతి అవినీతికి సంబంధించిన వివరణాత్మక వర్ణనను అందిస్తుంది. ఒక్కో అక్షరాన్ని క్లిక్ చేయగానే ఆర్థిక మోసాలకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్లు తెరపై కనిపిస్తున్నాయి. అదానీ పోర్ట్ స్కామ్ గురించి వివరాలు లెటర్ ఎ క్లిక్ చేయగానే వస్తాయి. లెటర్ బిని క్లిక్ చేయగానే ఆరు ముఖ్యమైన స్కామ్ల వివరాలు మన ముందు సాక్షాత్కరిస్తాయి.. 2008లో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుందేల్ఖండ్ ప్యాకేజీ స్కామ్, 2016-2017లో ఛత్తీస్గఢ్లో బడ్జెట్ అవకతవకలపై కాగ్ నివేదిక, వసుంధరా రాజే ఆధ్వర్యంలో రాజస్థాన్లో బజ్రీ మైనింగ్ స్కామ్, బిట్కాయిన్ స్కామ్, భామా షా. స్కామ్ , గోవాలో రూ. 5 కోట్ల నిర్మాణ కుంభకోణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు మన ముందుంటాయి. ‘సి’ ని క్లిక్ చేయగానే సుబిన్ ఇరానీ (కేంద్ర మంత్రి స్మతి ఇరానీ భాగస్వామి) చేసిన భూ కుంభకోణం ఉంది. ‘డి’ ని క్లిక్ చేసినప్పుడు, కర్ణాటక బీజేపీి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బీజేపీి కేంద్ర కమిటీకి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్ , గడ్కరీలతో సహా నాయకులకు కోట్ల రూపాయలు చేతులు మారిన వైనానికి సంబంధించిన ఆదాయపు పన్ను శాఖ రికార్డుల బహిర్గతమవుతాయి. సైట్ హౌమ్ పేజీలో 2000 కరెన్సీలు ధరించిన నరేంద్ర మోడీ చిత్రం బీజేపీ అవినీతికి నిలువెత్తు తార్కాణం. ‘ఎ’ నుండి ‘జెడ్’వరకు ఉన్న ఏ అక్షరంపై క్లిక్ చేస్తే , ఆ అక్షరంతో మొదలయ్యే అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలు కనుగొనవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos