నోవెల్ లేబరేటరీస్‌లో 9 మందికి కరోనా

నోవెల్ లేబరేటరీస్‌లో 9 మందికి కరోనా

హోసూరు : పట్టణంపై కరోనా పంజా విసిరింది. హోసూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో తొమ్మిది మంది ఉద్యోగులు కరోనా బారిన పడగా అధికారులు కంపెనీకి సీల్ వేశారు.  హోసూరు నేతాజీ రోడ్డులో మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలియడంతో అక్కడి ఇమాంబడా చుట్టుపక్కల సీల్ డౌన్ చేశారు. ఒకే రోజు హోసూరు పట్టణంలో 14 మంది కరోనా బారిన పడినట్లు తెలిసింది. పట్టణంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో స్థానికంగా ఆందోళన
వ్యక్తమవుతోంది. పట్టణంలోని షాపింగ్ సెంటర్లలో బౌతిక దూరాన్ని పాటించకపోవడం కరోనా వైరస్ ప్రబలడానికి కారణమవుతోందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు నామమాత్రంగా కరోనా నిరోధక చర్యలను అమలు చేయడం విమర్శలకు దారి తీసింది. ఏదేమైనా హోసూరు పట్టణంలో పెరుగుతున్నకరోనాను నియంత్రించాలంటే పట్టణ ప్రజలలో కూడా మార్పు అవసరం ఎంతైనా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos