స్పెయిన్ పాలిట శాపమైన చైనా కిట్స్..

స్పెయిన్ పాలిట శాపమైన చైనా కిట్స్..

కరోనా మహమ్మారి ధాటికి ఇటలీ,స్పెయిన్‌ దేశాలు అతలాకుతలమవుతున్నాయి.రోజూ వందలాది మందిని బలి తీసుకుంటూ కరోనా ఈ రెండు దేశాల్లో మరణశాసనం లిఖిస్తోంది.స్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇటలీని మించిపోయేలా కనిపిస్తోంది.స్పెయిన్‌లో కరోనా టెస్టుల్లో 30శాతం మాత్రమే కచ్చితమైన రిపోర్టులు వస్తున్నాయంటున్నారు. స్పెయిల్ లాబోరేటరీలు టెస్టులు చేయడంలో విఫలమవుతున్నాయని గురువారం స్పెయిన్ హెల్త్ ఎమర్జెన్సీ డైరెక్టర్ ఫెర్నాండో సీమోన్ వాపోయారు.తొమ్మిది వేల టెస్టుల్లో సంతృప్తికరంగా లేవని తెలిపారు.స్పెయిన్ లో కరోనా టెస్టులు చేసేందుకు సరిపడా ఎక్విప్ మెంట్ పరికరాలు ప్రభుత్వం కల్పించడం లేదు. దీంతో మార్చి 26 నాటికి నాలుగు వేల మరణాలు సంభవించాయి. చైనీస్ బయో టెక్నాలజీ కంపెనీ నాసిరకం కిట్స్ అందజేయడంతో వాటితో చేయడంతో సరిగా టెస్టులు రాక మరణాలు సంభవించాయి.స్పెయిన్ దేశం పరీక్షలు నిర్వహించేందుకు గాను కరోనా కిట్స్‌ను చైనా దక్షిణ కొరియా నుంచి 6 లక్షల 40వేల కిట్స్ కొనుగోలు చేసింది. చైనా నుంచి వచ్చిన మెడికల్ పరికరాలు సరిగా పనిచేయడం లేదని స్పెయిన్ ఆరోపించింది. కిట్ లతో పరీక్షలు చేయలేకపోతున్నామని స్పెయిన్ మెడికల్ బోర్డు చేతులెత్తేసింది.దీంతో ఇటలీ తర్వాత స్పెయిన్ లో టెస్టులు నిర్ధారణ కాక చాలా మంది మరణిస్తున్నారు. దీనికంతటికి చైనా నుంచి దిగుమతి అయిన నాసిరకం కిట్స్ అని స్పెయిన్ ఆరోపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos