శీతల పానీయాలతో పొంచి ఉన్న ముప్పు

శీతల పానీయాలతో పొంచి ఉన్న ముప్పు

ఫ్రక్టోస్ అధికంగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్, శీతల పానీయాల వల్ల కాలేయం పని తీరుపై దుష్ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వీటిల్లో ఉండే అధిక ఫ్రక్టోస్ వల్ల కాలేయంలో కొవ్వును కరిగించే మైటోకాండ్రియాలు పాడవుతాయని, దీని వల్ల కొవ్వు పేరుకుపోతుందని వెల్లడించారు. ఇది జీవక్రియపై ప్రభావం చూపుతుందని తెలిపారు. కొవ్వును కరిగించడంలో గ్లూకోజ్ పాత్ర ప్రధానమైనదన్నారు. గ్లూకోజ్, ఫ్రక్టోస్లు సమాన స్థాయిలో కేలరీలు కలిగి ఉన్నప్పటికీ, ఫ్రక్టోస్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చేటు తెస్తుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos