రైలు ఆలస్యానికి పరిహారం చెల్లింపు

రైలు ఆలస్యానికి పరిహారం చెల్లింపు

దిల్లీ: తేజస్ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామన్న ఐఆర్‌సీటీసీ మాటకు కట్టుబడింది. అక్టోబర్ 19న రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో 950మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించనున్నాయనమని అధికారులు వెల్లడించారు. రైళ్లు ఆలస్యమైతే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అక్టోబర్ 19న లక్నో నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తేజస్ రైలు దిల్లీకి 12.25 చేరుకోవాలి. కానీ, కాన్పూర్ ప్రాంతంలో గూడ్సురైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం 3.40 గంటలకు చేరుకుంది. అలాగే 3.35గంటలకు తిరిగి లక్నోకు బయలుదేరాల్సిన రైలు 5.30 గంటలకు గానీ కదలేదు. దీని వల్ల రాత్రి 10.05గంటలకు లక్నో చేరుకోవాల్సి ఉండగా, 11.30గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో లక్నో నుంచి ఢిల్లీకి వచ్చిన 45 0మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున, ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన 500 మందికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున చెల్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 6నుంచి తేజస్ ఎక్స్‌ప్రెస్‌ వాణిజ్య సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్టోబర్ 19, 20వ తేదీలలో మాత్రమే రైలు ఆలస్యంగా నడిచిందని అధికారులు తెలిపారు. అయితే 20న కేవలం 24ని మిషాలు మాత్రమే ఆలస్యమైందని, రెండో ట్రిప్‌ సమయానికి చేరుకుందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యమైతే ఒక్కో ప్రయాణిడికుడికి రూ.100 చొప్పున రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చొప్పున చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

తాజా సమాచారం