కలెక్టర్లకు పల్లెనిద్ర

కలెక్టర్లకు పల్లెనిద్ర

అమరావతి: జిల్లా కలెక్టర్లంతా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఆదేశించారు. ప్రతి నెలా కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని సూచించారు. అప్పుడే వాస్తవాలు అర్థమవుతాయన్నారు. స్థానికుల అభిప్రాయాలు చాలా ముఖ్యమని చెప్పారు. రాత్రి పూట విద్యార్థి వసతి గృహాలు, ఆస్పత్రులు, పల్లెల్లో నిద్రించాలని ఆదేశిం చారు. కొందరు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యట నలకు వెళ్లడం లేదనే ఫిర్యాదు తనకు వచ్చిందన్నారు. పరిపాలనలో కలెక్టర్లే తన కళ్లు, చెవులని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కలెక్టర్లే వారధిలాంటి వారని చెప్పారు. విమ ర్శించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వరాదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos