కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఊరట

కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఊరట

ముంబై: లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ఉద్యోగులకు సమాచార సాంకేతిక సంస్థ ఊరట కల్పించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో తమ అసోసియేట్ స్థాయి ఉద్యోగుల వరకూ ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. మన దేశంలోని మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించేందుకు, ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో ఇంటి నుంచే పని చేస్తున్న సిబ్బందికి కొత్త ల్యాప్టాప్లు, డెస్క్టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులనూ అందించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos