క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు

క్రిస్ గేల్ సిక్సర్ల  రికార్డు

సెయింట్ జార్జియా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ 500 సిక్సర్లను కొట్టిన ఆటగాడుగా రికార్డు సాధించాడు. ఇంగ్లండ్తో ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో అతనీ రికార్డును సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అప్రిది పేరిట ఉన్న 476 సిక్సర్ల రికార్డును గేల్ ఈ సిరీస్ తొలి మ్యాచ్లోనే అధిగమించాడు. వన్డే ఫార్మాట్లో గేల్ పది వేల పరుగల మైలురాయిని చేరుకున్నాడు.
భారీ లక్ష్య ఛేదనలో… కాగా నాల్గో వన్డేలో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగినా విండీస్‌ విజయం సాధించలేకపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గేల్ వి 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. డారెన్ బ్రేవో (61), కార్లోస్ బ్రాత్వైట్ (50), ఆశ్లే నర్స్ (43) రాణించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ ఐదు వికెట్లు సాధించగా, మార్క్ వుడ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (73 బంతుల్లో 82, 8 ఫోర్లు, 2 సిక్స్లు), జానీ బెయిర్ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్లు) వేసిన పునాదిపై వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జాస్ బట్లర్ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos