చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో మృతి

చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో మృతి

న్యూ ఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత, గాంధేయవాది సుందర్లాల్ బహుగుణ శుక్రవారం రిషికేష్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా హిమాలయాల్లో అడవుల సంరక్షణం కోసం, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేశారు. ఆయన కృషి, పట్టుదల కారణంగానే అడవుల నరక్కుండా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిషేధం విధించారు. ఆయన ఇచ్చిన ‘ఎకాలజీ ఈజ్ ది పెర్మనెంట్ ఎకానమీ’ అనే నినాదం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెట్లు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందిరకీ అర్ధమయ్యే రీతిలో 1973లో చేపట్టిన అహింసాయుత చిప్కో ఉద్యమంలో అడవుల పరిరక్షణ లక్ష్యంగా పోరాటం సాగించారు. చిప్కో అంటే ఆలింగనం అని అర్ధం. చెట్లను కొట్టివేస్తున్నప్పుడు ప్రజలు చెట్లకు ఆలింగనం చేసుకోడవం ప్రారంభమైది. ఆ విధంగా శాంతియుతంగా చేపట్టిన ఉద్యమంగా చిప్కో ఉద్యమం నిలిచిపోయింది. మొదట చెట్లను పరిరక్షించుకునే ఉద్యమంగా, క్రమంగా ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos