క్లౌడ్ కంప్యూటింగ్ వికేంద్రీకరణ ‘చిప్’

క్లౌడ్ కంప్యూటింగ్ వికేంద్రీకరణ ‘చిప్’

బెంగళూరు: క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించే సాఫ్ట్వేర్- వర్చువల్ సిస్టమ్ ఆన్ చిప్ ను సిక్రోనాట్ సంస్థ మంగళవారం ఇక్కడ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇది డేటా సెంటర్ హార్డ్ వేర్ మౌలిక వసతి, సాఫ్ట్వేర్ లైసెన్సింగ్, కూలింగ్ తదితర వ్యయాన్ని యాభై రెట్లు తగ్గిస్తుందని సంస్థ యజమాని మెహుల్ శర్మ విలేఖరులకు తెలిపారు. ఒక్కో సాఫ్ట్ వేర్ ధర రూ. నూరు యూరోలు. దాని నిర్వహణకు ఏటా రుసుము అదనంగా చెల్లించాలి. ‘డేటా భద్రత, రక్షణ, ప్రైవసీకి అన్ని రకాల కట్టదిట్టమైన పటిష్ట వ్యవస్థను రూపొందించామ’ ని మెహుల్ వివరించారు. క్లౌడ్ కంప్యూటింగ్ను వికేంద్రీకరించే తమ సాఫ్ట్వేర్ వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడిస్తుందని అంచనా వేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంకా ఈ సాఫ్ట్వేర్ వినియోగం వల్ల కేంద్ర ప్రభుత్వం, మధ్య, భారీ సంస్థలు ఐదు నుంచి ఎనిమిది వందల బిలియను డాలర్లు ఆదా చేయవచ్చనీ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos