చీనీ కాసులు తిన్న మోదీ చైనాను ఆక్షేపిస్తారా?

చీనీ కాసులు తిన్న మోదీ  చైనాను ఆక్షేపిస్తారా?

న్యూ ఢిల్లీ: ప్రముఖ చైనా కంపెనీల నుంచి పీఎం కేర్స్ కు భారీగా నిధులు ఎందుకు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మనుసింగ్వి సోమ వారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ దేశం వల్ల జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ ఆ మొత్తాల్ని ఎందుకు తీసుకున్నారని నిలదీసారు. ‘అసలు చైనా కంపెనీల నుంచి నిధులను ఎందుకు తీసుకున్నారు. ఈ నిధులు దారి మళ్లుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. కనీసం కాగ్ కూడా ఈ విషయంలో స్పందించడం లేదు. పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయింది. పీఎం కేర్స్ కు హువావే నుంచి రూ. 7 కోట్లు, టిక్ టాక్ నుంచి రూ. 30 కోట్లు, 38 శాతం చైనా భాగస్వామ్యం వున్న పేటీఎం నుంచి రూ. 100 కోట్లు, షియోమీ నుంచి రూ. 15 కోట్లు, ఒప్పో నుంచి రూ. 1 కోటి కు విరాళంగా వచ్చాయా? లేదా? ’అని ప్రశ్నించారు. చైనా నిధులను తీసుకున్న మోదీ, ఆ దేశ దురాక్రమణ నుంచి భారత్ ను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos