తైవాన్ పై చైనా ప్రతీకారం

తైవాన్ పై చైనా ప్రతీకారం

బీజింగ్ : తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనాప్రతీకార చర్యలకు దిగింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతు లను నిషేధించినట్లు చైనా కస్టమ్స్ విభాగం ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై గత ఏడాదిగా పలు సందర్భాల్లో అధికంగా పురుగు మందుల అవశేషాలు బయటపడినట్టు తెలిపింది. జూన్ లో కొన్ని ఫ్రోజెన్ ఫిష్ ప్యాకేజీలపై కరోనా వైరస్ ను గుర్తించినట్టు పేర్కొంది. తైవాన్కు ఇసుక ఎగుమతులను నిషేధించినట్లు చైనా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా మరో ప్రకటనలో తెలిపింది. తైవాన్ లో పండ్లను ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలు అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ కు చెందిన డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటాయి. అందువల్ల ఈ ప్రాంతాలను చైనా లక్ష్యం చేసుకుని ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos