చైల్డ్ పోర్నోగ్రఫీ బారత్ లోనే ఎక్కువ

మనుషుల మధ్య వారధిలా నిలుస్తూ హద్దుల్ని చెరిపేస్తున్న సామజిక మాధ్యమాలు ప్రపంచాన్ని సాంకేతికతంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.అయితే అదే సామజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతుండడం అత్యంత విషాదకరం.సామజిక మాధ్యమాల్లో ఒకటైన వాట్స్అప్ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ విస్తరిస్తున్నట్లు టెక్ క్రంచ్ సహా మరో ఎన్జీఓకు చెందిన ఇజ్రాయెల్ పరిశోధకుల బృందం గుర్తించింది.ముఖ్యంగా బారత్ లో ఇది మరింత వేగంగా విస్తరిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి లక్షల మెసేజ్ లు షేర్ అవుతున్నాయని అందులో అవసరమైన సమాచారంతో పాటు పోర్నోగ్రఫీ వంటి అన్ వాంటెడ్ ఇన్ ఫర్మేషన్ సైతం స్పీడుగా స్ర్పెడ్ అవుతున్నట్లు గుర్తించింది. థర్డ్ పార్టీ యాప్ ల నుంచి ఎవరి అనుమతి లేకుండానే వాట్సప్ గ్రూపుల్లోకి షేర్ అవుతున్నట్టు గుర్తించారు. ఇన్ వైట్ లింకుల సాయంతో సులభంగా వాట్సప్ లో అడల్ట్ కంటెంట్ ను స్ర్పెడ్ చేస్తున్నట్టు నిర్ధారించారు. ప్రపంచ దేశాల్లో కంటే ఒక్క భారత్ లోనే చైల్డ్ పోర్నోగ్రఫీ అధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనం హెచ్చరించింది.ఈ నేపథ్యంలో వాట్సప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అంటూ కొన్ని థర్డ్ పార్టీ యాప్ ల నుంచి లింకులను వందలాది వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్టు గుర్తించినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. అడల్ట్ కంటెంట్ ను ప్రచారం చేయడానికి ప్రత్యేకించి ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఉన్నాయని పేర్కొంది. ఇక్కడి నుంచే చైల్డ్ పోర్నోగ్రఫీని మెసేజింగ్ ప్లాట్ ఫాంపై స్ప్రెడ్ చేస్తున్నట్టు గుర్తించమన్నారు. చైల్డ్ ఎక్సోలేషన్ విధానాన్ని అతిక్రమించిన లక్ష 30వేలకు పైగా వాట్సప్ అకౌంట్ లను 10 రోజుల్లోనే బ్యాన్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos