విధ్వంసం కుట్ర విఫలం

విధ్వంసం కుట్ర విఫలం

న్యూఢిల్లీ:కశ్మీర్ ఎదురు కాల్పుల హతులు ముగ్గురూ భారత్లో భారీ దాడికి కుట్రపన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇందు కోసమే పెద్ద మొ త్తం లో బాంబులు, మార్ఫిన్ ఇంజెక్షన్లు, ఎల్ఈడీలు, బుల్లెట్ జాకెట్లు పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. రహదారి వెంబడి దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉన్న భద్రతా దళాల శిబిరాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు వేసారని వివరించారు. వారి కుట్ర ను గట్టిగా తిప్పి కొట్టామని పేర్కొన్నారు. కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టు బెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న జవాన్లపై లారీలో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీస్ జవాను ఒకరు గాయపడ్డారు. ఇతర జవాన్లు తిరిగి ఎదురు కాల్పులు జరిపినపుడు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వ్యాను డ్రైవర్ సమీన్ దార్ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్, గ్రెనెడ్లను, రూ. 32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు సముద్రంగా గుండా భారత్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos