జడ్జిది హత్యే : సీబీఐ

జడ్జిది హత్యే :  సీబీఐ

రాంచీ: జాగింగ్‌కు వెళ్లిన జార్ఖండ్ జడ్జిని కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది. అప్పట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 29న ధన్‌బాద్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఉదయం మెయిన్ రోడ్డుపై జాగింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే వెనక నుంచి వచ్చిన ఓ ఆటో ఆయన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆయనను ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ విషయమై దర్యాప్తు చేసిన సీబీఐ.. ఆనంద్‌ది హత్యేనని, కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కోర్టు ముందు తెలిపింది. దీనికి సంబంధించి గుజరాత్‌లోని గాంధీనగర్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విచారణ చేసి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉందని, ఫోరెన్సిక్ నివేదికలు తీసుకుంటే కేసు విచారణ పూర్తవుతుందని సీబీఐ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos