రాజుకు ఓటమి … ‘మంత్రి’ కి గెలుపు

రాజుకు ఓటమి … ‘మంత్రి’ కి గెలుపు

హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వారి బెయిల్ రద్దు కోసం వైకాపా రెబెల్ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు చేసిన వినతిని సీబీఐ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ వ్యాజ్యంపై జులై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేసిన కోర్టు బుధ వారం వెలువరించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశం ముగిసింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైకాపా శిబిరంలో సంతోష కర వాతా వరణం నెల కొంది.

తాజా సమాచారం