నిజ్జార్‌ హత్య దర్యాపుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రుడో

నిజ్జార్‌ హత్య దర్యాపుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రుడో

న్యూ ఢిల్లీ: ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హత్యపై తేల్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు దర్యాప్తులో భారతదేశం సహకారంపై ట్రూడోను ప్రశ్నించగా.. కెనడియన్ గడ్డపై కెనడా పౌరుడి హత్య అంగీకరించకూడని విషయమని, చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయని.. దాన్ని తాము తేలిగ్గా తీసుకోలేదన్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధ చర్యల నుంచి కెనడియన్లందరినీ రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.ఈ విషయంపై కెనడా ప్రభుత్వం సరైన విచారణ జరుపుతుందని ట్రూడో చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా పని చేయడానికి ఎదురు చూస్తున్నాం.. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వం హస్తం ఉందని గతంలో జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిజ్జార్ హత్యకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జార్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. గతేడాది జూన్లో బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా నిజ్జార్ హత్యకు గురయ్యాడు. అతన్ని ఓ కాంట్రాక్ట్ కిల్లర్ హతమార్చాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos