కేంద్ర హోంశాఖ హెల్ప్లైన్ సమాధానం వెల్లడి

కేంద్ర హోంశాఖ హెల్ప్లైన్ సమాధానం వెల్లడి

న్యూఢిల్లీ : ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్లైన్ నుంచి సమాధానం వచ్చిందని ది హిందూ తాజా కథనంలో పేర్కొన్నది. అఫిడవిట్, ఇతర పత్రాలతో సహా తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్గా ఈ అర్హత సర్టిఫికెట్ ఉన్నది. దీన్ని కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రజల్లో విశ్వాసం ఉన్న ఏ మత సంస్థ అయినా ఈ సర్టిఫికెట్ను జారీచేయవచ్చనే సమాధానం సీఏఏనుంచి వచ్చిందని హిందూ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos