మజ్జిగతో మరింత ఆరోగ్యం

మజ్జిగతో మరింత ఆరోగ్యం

ఉదయం టీ, కాఫీలకు బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కడుపులో ఉండే పేగుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తరిమికొట్టడంలో ఎంతో సహాయపడుతుంది మజ్జిగ. చక్కెర స్థాయిని నియంత్రించవవచ్చు. స్థూలకాయులు మజ్జిగలో కాస్త మిరియాలు, కరివేపాకు వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు. వేసవి కాలంలో మజ్జిగను మాత్రం మరిచిపోకూడదు. డీహైడ్రేషన్ను మజ్జిగ నియంత్రిస్తుంది. ఒంటి వేడికి మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి. అందువల్ల శరీరానికి బలం చేకూరుతుంది. మజ్జిగ ఆరోగ్యానికే కాదు చర్మానికి , శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కురులకు మజ్జిగను పట్టించి, ఒక అరగంట ఉండి తల స్నానం చేస్తే ఎంతో మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఉంచుకుని ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos