ఉత్తరాఖండ్‌ లో ఎద్దుల బండికీ జరిమానా

ఉత్తరాఖండ్‌ లో ఎద్దుల బండికీ  జరిమానా

డేహరాడూన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మోటార్ వాహనాల చట్టం-2019 సామాన్యులకు నరకాన్ని చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిం చకపోయినా కుంటి సాకులతో ప్రజలను జరిమానాలతో హింసించటం సర్వ సాధారణమై పోయింది. దీంతో సొంత వాహనాలు నడిపేందుకు జనం భీతిల్లుతున్నారు. ఉత్తరా ఖండ్ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసుల కంటే రెండు ఆకులు ఎక్కువగానే వంట బట్టించుకున్నారు. ఏకంగా ఎద్దుల బండికే జరిమానా విధించి రైతు జేబును గుల్ల చేసారు. డెహ్రాడూన్ కు చెందిన హసేన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపి ఉంచాడు. హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించి పోలీసులు హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 రసీదు ఇచ్చారు. దీనికి  హసేన్ ఘాటుగా స్పందించారు.‘అసలు ఎద్దుల బండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?’అని నిలదీశాడు. దీంతో పోలీసులు తోకముడిచి జరిమానాను రద్దు చేసి చల్లగా జారుకున్నారు. ఇది మాధ్యమాల్లో సంచలనమైంది. వాస్తవానికి హసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అతను తప్పు చేయలేదని తేలడంతో జరిమానాను రద్దు చేసామని పోలీసులు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos