బీఎస్పీ నేతకు బీజేపీ ఎర

బీఎస్పీ నేతకు బీజేపీ ఎర

భోపాల్: మధ్య ప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇతర పార్టీల శాసనసభ్యులకు భాజపా కోట్లాది రూపాయలు’ఎర’గా చూపి స్తోందని ఆరోపించిన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన వాదనకు మంగళ వారం మరింత పదునుపెట్టారు. బహుజన్ సమాజ్ పార్టీ (ఎమ్మెల్యే) రామ్భాయ్ని బీజేపీ నేత ఒకరు బాడుగ విమానంలో సోమవారంఢిల్లీకి తీసు కెళ్లారని మంగళ వారం ట్వీట్ చేసారు.’బీఎస్పీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యులను ఢిల్లీకి తరలించే ప్రక్రియను భాజపా మొదలు పెట్టేసింది. రామ్భాయ్నినిన్న బాడుగ విమానంలో భూపిందర్ సింగ్ ఢిల్లీకి తీసుకుపోలేదా? శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి మీరేమైనా చెబు తారా?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా రూ.25-35 కోట్ల రూపాయలు ఎర చూపి స్తున్నారు.15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న శివరాజ్, మిశ్రాలు విపక్షంలో కూర్చుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో బహిరం గంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.35 కోట్లు ఆశ చూపిస్తు న్నారు. తొలి విడతగా రూ.5 కోట్లు, రాజ్యసభ నామినేషన్ల తర్వాత రెండో విడత, ప్రభు త్వం కూలి పోయిన తర్వాత తక్కిన మొత్తం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తున్నారు.ఆధారాలు లేకుండా నేనెప్పుడూ ఎవరిపైనా ఆరోపణలు చేసింది లేద’ని తన వాదనను సమర్ధించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos