బోరిస్ జాన్సన్ రాజీనామా

బోరిస్ జాన్సన్  రాజీనామా

లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం ఇక్కడ తన పదవికి రాజీనామా చేపారు. కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి రాజీనామాల పర్వం ప్రభంజనంలా సాగు తుండటం ఇందుకు కారణం. గత మంగళవారం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు ప్రభుత్వం నుంచి వైదొలగారు. బోరిస్ జాన్సన్తో బుధవారం ఆయన మంత్రివర్గ సహచరులు సమావేశాలు జరిపి, పదవి నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత కమ్యూనిటీస్ సెక్రటరీ మైఖేల్ గోవ్ 20 16లో జరిగిన బ్రెగ్జిట్ రిఫరెండం ప్రచారంలో బోరిస్కు మద్దతిచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. గోవ్ ఓ పాము వంటివాడని బోరిస్ సన్నిహితు డొకరు మీడియాతో అన్నారు. గోవ్ 2016లోనూ, 2019లోనూ కన్జర్వేటివ్ లీడర్షిప్ కోసం బోరిస్తో పోటీ పడ్డారు. నన్ను పదవి నుంచి తొలగించాలంటే మీ చేతులు రక్తంతో తడవాల్సిందేనని బోరిస్ తన సహచరులతో అన్నారని బ్రిటిష్ మీడియా తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos