దక్షిణాది అంటే చిన్న చూపెందుకు?

  • In Film
  • October 20, 2019
  • 129 Views
దక్షిణాది అంటే చిన్న చూపెందుకు?

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని పలువురు సినీ ప్రముఖుల కోసం ప్రధాని అధికారిక నివాసంలో భారీ విందు,సమావేశం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్ముడి విలువలను, శాంతి సందేశాన్ని వినోద మాధ్యమం ద్వారా మరింత ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఈ సమావేశానికి దక్షిణాది చిత్ర పరిశ్రమల నటీనటులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మెగా కోడలు ఉపాసన సైతం దీనిపై సామాజిక మాధ్యమాల ఖాతాలో అసహనం వ్యక్తం చేశారు.ప్రియమైన నరేంద్రమోదీ గారు. మిమ్మల్ని దక్షిణాది ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. మీలాంటి ప్రధాని ఉండటం గర్వంగా భావిస్తాం. ఆ గౌరవం అలానే కొనసాగుతుంటుంది. కానీ మీరు నిర్వహించిన సమావేశానికి కొంతమంది హిందీ తారలనే పిలిచి.. దక్షిణాది సినీ ప్రముఖులను ఆహ్వానించకుండా నిర్లక్ష్యం చేశారనే ఫీలింగ్ కలిగింది అని ఉపాసన ట్వీట్ చేశారు.ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి దక్షిణాది తారలను పిలువకుండా హిందీ సినిమా ప్రముఖులనే పిలవడం నాకు చాలా బాధ కలిగించింది. దక్షిణాది తారలను నిర్లక్ష్యం చేశారనే నా బాధను ఇలా తెలియజేయాలని అనుకొన్నాను. కాబట్టి మీరు సరైన రీతిలో నా బాధను అర్ధం చేసుకొంటారనుకొంటాను అని ఉపాసన ట్వీట్లో పేర్కొన్నారు. చివరకు జై హింద్.. నరేంద్రమోదీ జీ అంటూ ట్వీట్ను ముగించారు. కాగా ప్రధాని మోదీని కలుసుకొన్న వారిలో తెలుగు పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos